అనగా అనగా.....
స్వాతంత్రం వచ్చిన తొలిరోజులు! రజాకార్ల దౌష్ట్యంతోనూ, కౄరచర్యలతోనూ అల్లాడిన నిజాం సంస్థానం, పటేల్ తీసుకొన్న పోలీసు చర్య అనంతరం భారత్ లో కలిసిపోయింది. ఈ సంఘటన రజాకార్ల అఘాయిత్యాలు పెట్రేగి ఉన్న సమయంలో జరిగింది, తర్వాత వెలుగుచూసింది.
హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసిపోయిన కొద్దికాలం తర్వాత ఓరోజు – కొంతమంది రైల్లో ప్రయాణిస్తున్నారు. అప్పటి రాజకీయాల గురించి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. వారి సంభాషణ నాటి నిజాం క్రౌర్యం గురించి, రజాకార్ల హింస గురించి నడుస్తుంది. హఠాత్తుగా ఒక మహిళ తన ఒంటిమీది దుస్తులన్నీ విప్పి, అందరి ఎదుట నగ్నంగా నిలబడింది. అక్కడ పిల్లలూ, స్త్రీలూ, పురుషులు ఉన్నారు. అందరూ దిగ్భ్రాంతులయ్యారు. ఎవరూ మాట్లాడలేదు.
కొన్ని క్షణాల తర్వాత తేరుకున్న ఓ పెద్దాయన, "ఏమిటిది తల్లీ! ఇలా అందరి ఎదుట నిలబడతావా? ఆడదానివి కాదూ! ఇలా నిలబడటానికి సిగ్గుగా లేదూ?" అన్నాడట. ఒక్కసారిగా అగ్నిపర్వతం బ్రద్దలయినట్లు ఆమె “నేను కాదు. మీరందరూ సిగ్గుపడాలి” అంటూ భోరుమన్నది. దుఃఖాతిశయం తీరాక, దుస్తులు ధరించి, “నన్ను రజాకార్లు బహిరంగ స్థలంలో నగ్నంగా చెట్టుకి కట్టేసి వారం రోజులుంచారు. నానా హింసా పెట్టారు” అంటూ తన శరీరం మీద నాటి హింసల గుర్తులు చూపిందట. చూస్తోన్న అందరి కళ్ళల్లో నీళ్ళు!
ఇది ఆ రోజుల్లో కృష్ణాపత్రికలో ప్రచురింపబడినట్లుగా 2008 లో ఆంధ్రజ్యోతి ప్రచురించింది. కేసీఆర్ ’నిజాం’ని పొగిడిన సందర్భములో ఈ వార్తని ప్రచురించింది.
ఇంతటి కసాయి తనం, హద్దుల్లేని హింస!
ఇదీ కథ!
ఇది నిజంగా జరిగిన సంఘటన. మన చరిత్ర.
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
13 సంవత్సరాల క్రితం
3 కామెంట్లు:
లక్ష్మి గారూ,
రజాకార్ల అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. అది తెలిసినా మన వాల్లు దాన్ని కప్పి పుచ్చడానికి ప్రయత్నిస్తారే తప్ప దాన్ని బయట పెట్టడానికి మాత్రం సాహసించరు. అది వారి ఓటు బ్యాంకుకు తీవ్ర నష్టం కలిగిస్తుంది మరి. ఎక్కడో జరిగిన నాజీల చిత్రహింసల గురించి పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేసే పద్దమనుషులు నాజీలంత కృరంగఆ ప్రవర్తించిన వారు మనదేశములో వున్నా పట్టించుకోరు. పైపెచ్చు మా నిజాములు బహుమంచి వారని కీర్తిస్తూ తాము సెక్యులరిస్టులమని (కుహన) నిరూపించుకుంటారు.
ఆకాశ రామన్న గారు: ఆ ఓటు బ్యాంకు రాజకీయాల గురించి, ముస్లిం గారాబం గురించి అసలు నిజాలు అమ్మఒడి టపాలలో వివరించానండి. వ్యాఖ్యకు నెనర్లు!
ప్రవీణ్ రంగినేని గారు: ఈ విషయం నేనూ విన్నానండి. అయితే నేను చదవలేదు.నెనర్లు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి