RSS
Wecome to my Blog, enjoy reading :)

పిసినారి ధనయ్య!

అనగా అనగా….

ఓ ఊళ్ళో ధనయ్య అనే నేతి వ్యాపారి ఉండేవాడు. అతడు వట్టి ఆశపోతు. మీదు మిక్కిలి పిసినారి కూడాను. లాభాల మీద ఆశకొద్దీ కల్తీ నెయ్యి అమ్మేవాడు.

ఓసారి ఊరికామందు ఇంట్లో పెళ్ళికి కూడా కల్తీనెయ్యి సరఫరా చేశాడు. ఆ నేతితో చేసిన మిఠాయిలు తిన్న చుట్టాలందరికీ వాంతులయ్యాయి.

దాంతో ఊరికామందు ధనయ్యని పిలిపించి పంచాయితీ పెట్టించాడు. నెయ్యి కల్తీదని ఋజువు కావటంతో ధనయ్యని దోషిగా నిర్ధారించాడు. దాంతో శిక్ష ఖరారయ్యింది.

వెయ్యి వరహాల జరిమానా విధించారు. పిసినారి ధనయ్య కట్టలేనన్నాడు.

వంద కొరడా దెబ్బలు విధించారు. దెబ్బలు తినలేనన్నాడు.

అయితే మణుగు నెయ్యి తాగమన్నారు. ఆశపోతు ధనయ్యకి ఈ శిక్ష లాభసాటిగా అన్పించింది. సరేనన్నాడు.

కానీ సగం నెయ్యి తాగేసరికీ గుడ్లు తేలేసాడు.

దాంతో కొరడాదెబ్బలు తింటానన్నాడు. కానీ యాభై దెబ్బలు తినేసరికీ బేర్ మన్నాడు.

నోరు మూసుకుని వెయ్యి వరహాలు జరిమానా కట్టి ఏడ్చుకుంటూ ఇంటికి పోయాడు.

పిసినారి ధనయ్యకి తగిన శాస్తి జరిగిందని ఊళ్ళో వాళ్ళంతా నవ్వుకున్నారు. ధనయ్య మాత్రం తన పిసినారితనంతోనూ, ఆశపోతుతనంతోనూ వరసగా అన్ని శిక్షలూ అనుభవించి, అసలు అదే సరైన శిక్ష అన్పించుకున్నాడు.


~~~~~~~~~~

7 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

Katha chala baagundhi

అజ్ఞాత చెప్పారు...

"లోభికి మూడు నష్టం " అనే నీతితో ఈ కథ చిన్నప్పుడు నాన్న గారి ద్వారా విన్నట్లు గుర్తు.. కథ బాగుంది. బాల్యం గుర్తు చేసినందుకు ధన్యవాదాలు :)

swapna@kalalaprapancham చెప్పారు...

ilantivanni kadhalake parimatham. real life lo matram evarithe pisuga untaro valla daggare dabbu muluguthundi. ekkado vinna pisu ga unnavalla daggare lakshmi devi untundata ekadiki podata. naku idi nijame anipistadi ma maamayya vallani chuste :)

Nagaraju చెప్పారు...

Hi,

Read my blog
gsystime.blogspot.com

You will get so much of information

thanks,
Nagaraju

Manikanth చెప్పారు...

Good story with a morale ! btw, bhatti vikramarka series lo next story 23 inka post cheyaledhaa meeru?? vere topic story post cheyadam lo edhaina prathyeka antharyam !!?

amma odi చెప్పారు...

కరుణా గారు, అజ్ఞాత గారు: నెనర్లండి!

స్వప్న గారు: మా అనుభవంలో మాత్రం ఎప్పుడయినా లోభత్వం చూపినప్పుడు నష్టపోవటమే జరిగిందండి!:)

మణికాంత్ గారు: కొంచెం పని ఒత్తిడి వలన భట్టి విక్రమార్క కథ వ్రాయలేదండి. వీలైనంత త్వరలోనే టపా వేస్తానండి!:)

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

AMMA ODI గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

హారం

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes