అనగా అనగా.....
మన చరిత్రలో జరిగిన కథ!
ఛత్రపతి శివాజీ ’రాజ’ కుటుంబం నుండి రాలేదు. సాధారణ రాజోద్యోగ కుటుంబం నుండే వచ్చాడు. ఆయన దృఢ సంకల్పం, మంచి చేయాలనే దృక్పధం భగవంతుడి నుండీ, పురాణీతిహాసాల నుండి, ధర్మతత్త్వ చింతన నుండీ ఆయన పొందిన స్ఫూర్తి, ఆయనలోని ఉత్తేజం, ఆయన అనుచరుల్లోకి ప్రవహించి ప్రజ్వరిల్లింది. సమిష్టి కృషి అద్భుతాన్ని ఆవిష్కరించింది.
ఈ ప్రయత్నంలో ఓసారి శివాజీ షెయిస్తఖాన్ ని ఎదుర్కొనాల్సి వచ్చింది. షెయిస్తఖాన్ ఏడడుగుల ఎత్తులో, శరీరక బలంతో, కౄరుడిగానూ, రాక్షసుడిగానూ పేరు పడ్డాడు. ఔరంగజేబు తరుపున శివాజీతో చర్చించడానికి వస్తున్నాడు. అయితే ఇది పైకారణం మాత్రమే. ఆ వంకతో శివాజీని చంపడమే అతడి లక్ష్యం. ఈ విషయం శివాజీకి తన వేగుల ద్వారా ముందే తెలుసు.
శివాజీ ఆ ప్రమాదాన్ని[రిస్క్ ని] ఎదుర్కొనేందుకే నిశ్చయించుకున్నాడు. ఈ సంఘటనని ఎదుర్కొడానికి బయలుదేరేముందు శివాజీ తన అనుచరులందర్నీ జాగరూకుల్ని చేసి, తదుపరి కర్తవ్వాన్ని వివరించాడు. ఒకవేళ షెయిస్తఖాన్ తో పోరాటంలో తాను ప్రాణాలు కోల్పోయినా, సమాజంలో నీతినీ, విలువల్నీ హిందూ సంస్కృతినీ పునఃప్రతిష్టించే పనిని తాము కొనసాగించాలని ప్రభోదించాడు. అవీ వారి ధైర్యసాహసాలూ, ధృఢ సంకల్పాలు!
ప్రతిపాదిత సమయానికి శివాజీ, షెయిస్తఖాన్ ని కలిసేందుకు బయలుదేరాడు. రహస్యంగా తన చేతి పది వెళ్ళకు పులిగోళ్ళను పోలిన ఇనుపగోళ్ళను తగిలించుకున్నాడు. షెయిస్తఖాన్ విశాలంగా నవ్వుతూ శివాజీని ఆహ్వానించాడు. స్నేహాన్ని వ్యక్తీకరిస్తూ శివాజీని కౌగిలించుకున్నాడు. నిజానికది మృత్యుకౌగిలి; శివాజీకైనా, షెయిస్తఖాన్ కైనా. ఆ కౌగిలింతలోనే శివాజీని పిడిబాకుతో పొడిచి చంపాలని షెయిస్తఖాన్ ప్రయత్నించాడు.
అయితే శివాజీ షెయిస్తఖాన్ కంటే చురుగ్గానూ, వేగంగానూ కదిలాడు. షెయిస్తఖాన్ తనను బాకుతో పొడవబోయే లోగానే తాను అతని వీపుని తన ఇనుపగోళ్ళతో చీల్చివేశాడు. అది చూసి షెయిస్తఖాన్ సైనికులు మ్రాన్పడిపోయాడు. తమ శిబిరంలోకి వచ్చి తమ నాయకుణ్ణి చంపే సాహసాన్ని వాళ్ళు ఊహించలేదు. వారా దిగ్ర్భమ నుండి తేరు కొనే లోగానే శివాజీ సైన్యం వారిపై దాడి చేసింది. అప్పటికే భయభ్రాంతులైన షెయిస్తఖాన్ సైనికులు పలాయనం చిత్తగించారు.
ఆ విధంగా శివాజీ కర్తవ్యం కంటే ప్రాణాలు విలువైనవి కావని నిరూపించాడు. ఎందుకంటే వ్యక్తి జీవితం ఈ ప్రపంచంలో ఎప్పటికీ తాత్కాలికమే. కానీ ధర్మం, విలువలు మాత్రం శాశ్వతం. మనం ఎలా బ్రతికినా, ఏదో ఒక రోజున చావడం ఖాయం. కానీ చావనిది సంస్కృతి, ధర్మమే.
మరో కమ్మని కథ లాంటి విషయం కోసం వేచి చూడండి.
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
13 సంవత్సరాల క్రితం
5 కామెంట్లు:
నాకు మా ఇంటర్ మీడియేట్ సంస్కృత ఉపాధ్యాయుడు ఈ కథ ఇంకోలా చెప్పాడు... శివాజీ చర్చలకి పిలిచి ఏదో బురుజు పక్కన సమావేశం ఏర్పాటు చేశాడనీ, భయపడుతున్నట్లు నటిస్తూ, అతనితో రక్షణ భటులనూ, ఇంకా మిగతా రక్షణ సామాగ్రీనీ దూరం చేస్తూ .. కోట దిగుతూ, వెనక్కి వెళ్తూ భయం నటించాడని ... ఇలా చాకచక్యం గా వ్యవహరిస్తూ చివరగ ఇనుప కవచం ధరించి ఉండటం వలన శతృవు దెబ్బ నుండి తప్పించుకుని... తన విషపు గోళ్ళతో చంపివేశాడని మా లెక్చరర్ చెప్పాడు.. దీనిని ఏదో పుస్తకం లో వర్ణించి ఉందని తెలిపాడు..
ఈ కధ మా అమ్మమ్మ నాకు ఇలానే చెప్పింది. మీకు మంచి కధ చెప్పినందుకు ధన్యవాధములు.
రమణ గారు: శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రంలో కూడా కథ ఇలాగే ఉందండి. నెనర్లు!
వైష్ణవి బుడ్డీ: చిట్టీతల్లీకి ఆశీస్సులు!
baagundandee.thelisinave ayinaa baaguntunnaayi.
baagundandee.thelisinave ayinaa manchi neethi kathalu.
కామెంట్‌ను పోస్ట్ చేయండి